గువ్వలచెన్న శతకమును క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన కవి గువ్వల చెన్నడు రచించెను. ఇతడు వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినవాడు. " గువ్వల చెన్నా" అనే మకుటంతో ఈ శతకాన్ని కంద పద్యాలతో రచించాడు. ఇతడు లోక నీతిని , రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు. అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు.
క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు " గువ్వల చెన్నా" అనే మకుటంతో శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని , రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. "ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా" అంటాడు. తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!